Chiranjeevi: చిరంజీవిని అడిగి రాజకీయాల్లోకి వెళ్లాను: నటుడు రవికిషన్

  • హైదరాబాద్ లో సైరా సక్సెస్ మీట్
  • పాల్గొన్న రవికిషన్
  • చిరంజీవి, సురేందర్ రెడ్డిలకు ధన్యవాదాలు చెప్పిన నటుడు

భోజ్ పురి చిత్రాల్లో సూపర్ స్టార్ హోదా సంపాదించుకున్న రవికిషన్ తెలుగులో ప్రతినాయక పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా ఆయన చిరంజీవి ప్రతిష్ఠాత్మక చిత్రం సైరాలో నటించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్ కు హాజరైన సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సైరా వంటి గొప్ప చిత్రంలో నటించడానికి అదృష్టం ఉండాలని, అందుకు చిరంజీవి, సురేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.

ఇక తాను రాజకీయాల్లోకి వెళ్లాలా? వద్దా? అని ఊగిసలాడుతున్న సమయంలో చిరంజీవిని సలహా అడిగానని రవికిషన్ గుర్తుచేసుకున్నారు. గెలుపుపై ధీమా ఉంటే తప్పకుండా ముందడుగు వేయమని ప్రోత్సహించారని, ఆయన మాటతోనే ధైర్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ప్రచారం చేశానని, ఎన్నికల బరిలో దిగి ఎంపీగా గెలిచానని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రవికిషన్ 3 లక్షల ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు.

Chiranjeevi
Sye Raa Narasimha Reddy
Ravi Kishan
Tollywood
  • Loading...

More Telugu News