Jagan: బోటు ప్రమాదంపై ప్రశ్నించిన దళిత నేతపై బెదిరింపులకు పాల్పడుతున్నారు: పంచుమర్తి అనురాధ

  • బోటు ప్రమాదం జరిగి 21 రోజులైనా మృత దేహాలను వెలికి తీయలేకపోయారు
  • సామాన్యుల ప్రాణాలంటే జగన్ కు లెక్కలేదా?
  • వైసీపీ పాలనలో ప్రజలకు దసరా సంతోషం కూడా లేదు

గోదావరిలో బోటు ప్రమాదం జరిగి 21 రోజులైనా ఇంత వరకు మృత దేహాలను వెలికి తీయలేకపోయారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు. తన అసమర్థ పాలనతో సీఎం జగన్ బోటును బయటకు తీయలేకపోయారని అన్నారు. సామాన్యుల ప్రాణాలంటే జగన్ కు లెక్కలేదా? అని ప్రశ్నించారు. జలవనరుల శాఖ, పర్యాటక శాఖ మంత్రులు పత్తా లేకుండా పోయారని చెప్పారు. బోటు ప్రమాదంపై ప్రశ్నించిన దళిత నేతపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు కూడా వైసీపీ పాలనలో దసరా సంతోషం లేదని అన్నారు. దసరా పండుగ కేవలం వైసీపీ కార్యకర్తలకేనని చెప్పారు.

Jagan
YSRCP
Panchumarthi Anuradha
Telugudesam
  • Loading...

More Telugu News