Pawan Kalyan: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న పవన్ కల్యాణ్ తనయుడు?

  • ఇప్పటికే ఓ మరాఠీ చిత్రంలో నటించిన అకీరా
  • త్వరలోనే కుమారుడిని టాలీవుడ్ లో లాంచ్ చేయనున్న పవన్ కల్యాణ్
  • నిర్మాత రామ్ చరణ్ అని సమాచారం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తన పూర్తి దృష్టిని రాజకీయాలపైనే ఉంచారు. ఈ నేపథ్యంలో, పవన్ వారసుడు అకీరా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అకీరా మరాఠీలో ఓ సినిమా చేశాడు. ఆ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే, డబ్బింగ్ సినిమాతో కాకుండా, డైరెక్ట్ మూవీతో తన కుమారుడిని లాంచ్ చేయాలని పవన్ భావిస్తున్నారట. త్వరలోనే అకీరా టాలీవుడ్ ప్రవేశం ఉంటుందని చెబుతున్నారు. మరో సమాచారం ప్రకారం... అకీరా అన్నయ్య రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ లోనే ఈ చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం.

Pawan Kalyan
Akira
Tollywood
  • Loading...

More Telugu News