Hruthik Roshan: హృతిక్ రోషన్ కు మహిళా క్రికెటర్ డేరింగ్ సలహా...హాట్ టాపిక్!

  • ఇటీవలే 'వార్' సినిమా చూసిన భావన
  • హృతిక్ అందానికి ఫిదా
  • జీన్స్ కొనసాగించాలంటూ సలహా

కండలు తిరిగిన శరీరంతో గ్రీకు వీరుడిలా కనిపించే బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్‌, తన జీన్స్ ను కొనసాగించేందుకు వీర్యదానం చేయాలంటూ, తమిళనాడుకు చెందిన మహిళా క్రికెటర్ భావన సోషల్ మీడియా మాధ్యమంగా ఇచ్చిన సలహా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇటీవల తన స్నేహితులతో కలిసి హృతిక్ నటించిన తాజా చిత్రం 'వార్'ను తిలకించి, హృతిక్ శరీరాకృతికి, అందానికి ముగ్ధురాలైపోయిన భావన, తనతో పాటు ఎంతో మంది అమ్మాయిలు హృతిక్ ను చూసి ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చింది. అతను వీర్యదానం చేస్తే, ఆ అందం కొనసాగుతుందని చెప్పింది.

Hruthik Roshan
Bhavana
Sperm
Social Media
  • Loading...

More Telugu News