accident: సెల్ఫీ సరదాకు బలి... జలాశయంలో పడి నలుగురి మృతి!

  • రిజర్వాయర్‌ సందర్శనకు వెళ్లిన స్నేహితులు
  • గట్టుపై నిలబడి ఫొటో తీసుకుంటుండగా జారిపడిన వైనం
  • మృతదేహాలు వెలికితీసిన పోలీసులు

సెల్ఫీ సరదాలో పడి ప్రమాదాన్ని ఊహించక పోవడంతో నలుగురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...జిల్లాలోని ఊత్తంగరై సమీపంలోని సాంబారు జలాశయ సందర్శనకు స్నేహితులైన సంతోష్‌ (14), స్నేహ (19), వినోద (18), నివేద (20) నిన్న సాయంత్రం వెళ్లారు. జలాశయం అందాలు చూస్తూ పరవశించిపోయారు.

అనంతరం జలాశయం గట్టుపై నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా నలుగురూ ఒకేసారి జారి జలాశయంలోకి పడిపోయారు. ఈ ఘటనను చూసిన స్థానికులు వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి నలుగురి మృతదేహాలను వెలికితీశారు.

accident
tamilanadu
sambaru reservoir
four died
selfi
  • Loading...

More Telugu News