bengaluru: ఐటీ కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్‌పై ట్రిపుల్ తలాక్ కేసు.. బెంగళూరులో మొదటిది!

  • ఆగస్టు 14న భార్యకు ముమ్మారు తలాక్ చెప్పిన సమీరుల్లా
  • 15న పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
  • విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్

కర్ణాటక రాజధాని బెంగళూరులో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. ఈ కేసులో ఓ ఐటీ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న సమీరుల్లా (38)ను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. సమీరుల్లాపై అతడి భార్య ఆయేషా (33) గత నెల 15న  సుద్దగుంటపాళ్యం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆగస్టు 14న భర్త తనకు ముమ్మారు తలాక్ చెప్పి వెళ్లిపోయాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సమీరుల్లాను ఆదేశించారు. పోలీసుల ఆదేశాలను పెడచెవిన పెట్టిన ఆయనను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. 

bengaluru
Karnataka
triple talaq
  • Loading...

More Telugu News