Radhakrishna: అమిత్ షాను కలిసిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ!

  • రాధాకృష్ణను ఆహ్వానించిన అమిత్ షా
  • షా నివాసంలోనే భేటీ
  • దాదాపు గంటన్నర పాటు చర్చలు

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన రాధాకృష్ణ, దాదాపు గంటన్నర పాటు ఆయనతో సమావేశం అయ్యారు. అమిత్ షా నివాసంలోనే ఈ సమావేశం జరిగింది. ఆర్టికల్‌ 370 రద్దుకు దారితీసిన పరిస్థితులను రాధాకృష్ణకు అమిత్ షా వివరించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై అమిత్ షా ఆరా తీసినట్టు సమాచారం. ఆపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏబీఎన్‌ చానెల్‌ నిలిపివేత గురించి రాధాకృష్ణను ఆయన అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది.

Radhakrishna
Andhrajyoti
ABN
Amit Shah
  • Loading...

More Telugu News