Telangana: తెలంగాణలో వర్షాలు, పిడుగుల బీభత్సం... ఐదుగురు మృతి

  • తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు
  • సిద్ధిపేటలో ఇద్దరు మృతి
  • దిగ్భ్రాంతికి గురైన మంత్రి హరీశ్ రావు

ఉపరితల ఆవర్తనం ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు పిడుగులు కూడా పడడంతో ఐదుగురు మృతి చెందారు. సిద్ధిపేట జిల్లా చింతల చెరువు సమీపంలో పిడుగుపాటుతో ఇద్దరు మరణించారు. ఈ సంఘటన తెలియడంతో మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లాలోనూ ఓ వ్యక్తి పిడుగుపాటుకు బలవగా, భద్రాద్రి జిల్లా చొప్పలలో స్రవంతి అనే యువతి పిడుగుపాటుకు మృతి చెందింది. కొమురంభీమ్ జిల్లా భైరిగూడలో మరొకరు మరణించగా, ఇద్దరికి గాయాలయ్యాయి.

Telangana
Rains
Harish Rao
  • Loading...

More Telugu News