Abhinandan Vardhaman: అభినందన్ ధైర్యానికి మరో గుర్తింపు... మొత్తం టీమ్ కు అవార్డు!

  • 51వ స్క్వాడ్రన్ కు యూనిట్ సైటేషన్
  • 8న అందుకోనున్న స్క్వాడ్రన్ కెప్టెన్ సతీశ్ పవార్
  • 87వ వాయుసేన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన తరువాత, ఈ సంవత్సరం ఫిబ్రవరి 27న పాక్ వాయుసేన ఇండియాపైకి వచ్చినప్పుడు, ఓ ఎఫ్-16 విమానాన్ని కూల్చి, ఆపై ప్రమాదవశాత్తూ పాక్ సైనికులకు చిక్కి, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్... ఇప్పుడు తన టీమ్ మొత్తానికీ అరుదైన గుర్తింపును అందించాడు. అభినందన్ పనిచేస్తున్న 51వ స్క్వాడ్రన్ కు యూనిట్ సైటేషన్ అవార్డు లభించింది. భారత వాయుసేన ప్రారంభమై 87 సంవత్సరాలు గడిచిన సందర్భంగా 8న జరిగే వేడుకల్లో 51వ స్క్వాడ్రన్ తరఫున గ్రూప్ కెప్టెన్ సతీష్ పవార్ అవార్డు అందుకోనున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా అవార్డును అందించనున్నారు.

కాగా, 87వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైన వాయుసేన, ఈ ఉదయం నుంచి ఘజియాబాద్ లోని ఎయిర్ బేస్ లో ఫుల్ డ్రస్ రిహార్సల్స్ చేస్తోంది. పలు అధునాతన విమానాల ప్రదర్శన, అబ్బురపరిచేలా ఎయిర్ షో, ఆకాశ్ గంగా టీమ్లోని  స్కై డైవర్స్ స్టంట్లు తదితరాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Abhinandan Vardhaman
Squadren
Unit Citation
Award
Air Force
  • Loading...

More Telugu News