Bihar: జలదిగ్బంధంలో చిక్కుకుని ఇళ్ల పైకప్పులు, చెట్లపైన జీవనం

  • బీహార్‌ రాష్ట్రంలో వరద బాధితుల దీనగాథ
  • మూడు వారాలుగా తిండి లేక ఇబ్బందులు
  • చెప్పుకునే అవకాశం కూడా లేక సమస్యలు

బీహార్‌ను కుదిపేసిన వర్షాలు, వరదలతో అక్కడి బాధిత ప్రాంత ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. మూడు వారాలుగా  జలదిగ్బంధంలో చిక్కుకుని చాలామంది చెట్లపైన, ఇళ్ల పైకప్పులపైనా ఉండి ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. తినేందుకు తిండి, తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితుల్లో కుటుంబాలతో సహా అల్లాడిపోతున్నారు. ‘బయట ప్రపంచానికి మా పరిస్థితి తెలిసే అవకాశం కూడా లేకపోవడం మా దురదృష్టం’ అని బాధితులు వాపోతున్నారు. రాష్ట్రంలో భాగల్‌పూర్‌ జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చాలామందికి ప్రస్తుతం ఇళ్ల పైకప్పులే ప్రధాన ఆధారమయ్యాయి.

సీజన్‌లో కురిసిన భారీ వర్షాలకు తోడు నదులు పొంగి ప్రవహించడంతో రాష్ట్రంలోని పాట్నా, భాగల్‌పూర్‌, కైమూర్‌ జిల్లాలపై బాగా ప్రభావం చూపింది. పదుల సంఖ్యలో బాధితులు మృతి చెందారు. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలే తెగిపోయాయి.

దీంతో ప్రభుత్వం చేపడుతున్న అరకొర సహాయక చర్యలు కూడా తమ వరకు చేరక పోవడంతో ఎప్పటికి తామీ ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామా అని చాలా మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News