New Delhi: బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు.. సీఎం కావడమే తన కల అన్న మాజీ క్రికెటర్

  • ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప గౌరవం
  • అదే జరిగితే నా కల నెరవేరినట్టే 
  •  ఢిల్లీ సీఎంపై సెటైర్లు వేసిన బీజేపీ ఎంపీ

ఢిల్లీ ముఖ్యమంత్రి కావడమే తన కల అని టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప గౌరవమని, అది అతిపెద్ద బాధ్యత కూడానని పేర్కొన్న గంభీర్.. అదే జరిగితే తన కల నెరవేరినట్టేనని పేర్కొన్నాడు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్ మాట్లాడుతూ ఇలా తన మనసులోని మాటను బయటపెట్టేశాడు.

అనంతరం మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించాడు. ఢిల్లీ రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని, కాబట్టి వీలైనంత నెమ్మదిగా వెళ్లాలని సెటైర్లు వేశాడు. క్రికెటర్ నుంచి రాజకీయ నేతగా మారిన గంభీర్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి 3.91 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

New Delhi
Cricket
gautam gambhir
Chief Minister
  • Loading...

More Telugu News