Sye Raa Narasimha Reddy: టొరొంటోలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రదర్శన నిలిపివేత

  • థియేటర్‌లోకి ప్రవేశించి కత్తితో తెరను చించేసిన దుండగుడు
  • ప్రేక్షకులపై పెప్పర్ స్ప్రేను వెదజల్లిన వైనం
  • విట్బీలోనూ ఇటువంటిదే మరో ఘటన

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రదర్శనను కెనడాలోని టొరొంటోలో నిలిపివేశారు. ఒంటారియోలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల కారణంగా చిత్ర ప్రదర్శనను నిలిపివేసినట్టు సమాచారం. సినిమా ప్రదర్శితమవుతున్న కిచెనెర్‌లోని ‘ల్యాండ్‌మార్క్ సినిమాస్‌’లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా కత్తి తీసి తెరను చించేశాడు. అనంతరం ప్రేక్షకులపైకి పెప్పర్ స్ప్రేను వెదజల్లి పరారయ్యాడు. దీంతో వారు భయాందోళనకు గురై పరుగులు తీశారు.

విట్బీలోనూ ఇటువంటిదే మరో ఘటన జరిగింది. ఒంటారియో ప్రావిన్స్‌లో జరిగిన ఈ రెండు ఘటనల కారణంగా సినిమా ప్రదర్శనను నిలిపివేశారు.  అలాగే, వేర్వేరు ప్రాంతాల్లో ఇటువంటివే మరికొన్ని ఘటనలు జరగవచ్చన్న ఆందోళన వ్యక్తమవడంతో ముందుజాగ్రత్త చర్యగా సినిమా ప్రదర్శనను నిలిపివేసినట్టు తెలుస్తోంది.

Sye Raa Narasimha Reddy
Chiranjeevi
Canada
toronto
  • Loading...

More Telugu News