Green Challenge: ‘గ్రీన్ ఛాలెంజ్’.. ఎంపీ సంతోష్ కుమార్, హీరో అఖిల్ అక్కినేనికి నటుడు వరుణ్ తేజ్ ‘థ్యాంక్స్’

  • తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన వరుణ్ తేజ్
  • గ్రీన్ ఛాలెంజ్ కు తమన్నా, సాయి పల్లవి నామినేట్  
  • ఇలాంటి పనులకు సమయం కేటాయించడం సంతోషంగా ఉంది: వరుణ్ తేజ్

భారతదేశం పచ్చగా కళకళలాడాలన్న ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఛాలెంజ్’ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మొక్కలు నాటిన ఒక వ్యక్తి మరో ముగ్గురు వ్యక్తులతో, ఆ ముగ్గురు మరో  ముగ్గురితో.. ఇలా మొక్కలు నాటించేందుకు కృషి చేయాలి. ఈ సందర్భంగా ప్రముఖ యువ హీరో వరుణ్ తేజ్ కు సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఛాలెంజ్’ విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన వరుణ్ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటాడు.

ఈ సందర్భంగా ఆ ఫొటోలను వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. గ్రీన్ ఛాలెంజ్ కు తనను నామినేట్ చేసిన సంతోష్ కుమార్ కి, హీరో అక్కినేని అఖిల్ కు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. షూటింగ్ కారణంగా కొంత బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి ముఖ్యమైన పనులకు సమయం కేటాయించడం సంతోషంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో అన్నాడు. ఈ సందర్భంగా హీరోయిన్లు తమన్నా, సాయి పల్లవికి వరుణ్ తేజ్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

Green Challenge
Varun tej
Mp
Santosh kumar
  • Loading...

More Telugu News