Raj Thackeray: రాజ్ థాకరే భార్యకు తప్పిన పెను ప్రమాదం

  • లోనావాలా నుంచి ముంబై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
  • ఎదురుగా ఆటో రావడంతో సడన్ బ్రేక్ వేసిన కారు డ్రైవర్
  • వెనుక నుంచి ఢీకొన్న మరో కారు

మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే భార్య షర్మిలా థాకరే పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైంది. ఈ ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ముంబై శివారు ప్రాంతమైన లోనావాలా సమీపంలో ఉన్న ఏకవీరాదేవి ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఊహించని విధంగా కారుకు ఎదురుగా ఓ ఆటో రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో, వెనుక వస్తున్న మరో కారు షర్మిల ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయలు కాలేదు. మరో కారులో ఆమె ముంబై వెళ్లిపోయారు. ప్రమాద సమయంలో కారులో రాజ్ థాకరే కార్యదర్శి సచిన్ మోరే కూడా ఉన్నారని మహారాష్ట్ర టైమ్స్ తెలిపింది.

Raj Thackeray
Wife
Sharmila Thackeray
Accident
MNS
  • Loading...

More Telugu News