Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు రాజీనామా లేఖను పంపించిన ఆకుల సత్యనారాయణ

  • ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా
  • గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఆకుల
  • గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఓటమిపాలైన ఆకుల

అందరూ ఊహించినట్టుగానే జనసేనకు ఆ పార్టీ నేత ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జనసేనాని పవన్ కల్యాణ్ కు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో ఆయన పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పార్టీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే రావెల కిశోర్ బాబు, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు, మారంశెట్టి రాఘవయ్య, చింతల పార్థసారథిలు పార్టీకి గుబ్ బై చెప్పారు. తాజాగా, ఆకుల సత్యనారాయణ కూడా గుడ్ బై చెప్పడంతో... పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ ఓటమి పాలయ్యారు.

Pawan Kalyan
Akula Satyanarayana
Janasena
  • Loading...

More Telugu News