Hucha Venkat: కాలేజ్ అమ్మాయి దగ్గరకు వెళ్లి, పెళ్లి చేసుకోమని వేధించిన కన్నడ నటుడు

  • బస్సు కోసం వేచిచూస్తున్న అమ్మాయిని వేధించిన వెంకట్
  • భయంతో పరుగులు తీసిన అమ్మాయి
  • కారు అద్దాలను పగలగొట్టుకున్న వెంకట్

కన్నడ సినీ నటుడు, నిర్మాత హుచ్చ వెంకట్ పై రాజానుకుంట పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, హిందూపురం-యలహంక మార్గంలోని మారసంద్ర టోల్ గేట్ వద్ద ఆయన రచ్చ చేశారు. దొడ్డబల్లాపూర్ మీదుగా టోల్ గేటు వద్దకు వచ్చిన ఆయన... అక్కడ కారును నిలిపి కిందకు దిగాడు.

టోల్ వద్ద బస్ కోసం వేచి చూస్తున్న ఓ కాలేజ్ అమ్మాయి వద్దకు వెళ్లి... తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధించాడు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ నేపథ్యంలో, తన కారు అద్దాలను తానే హుచ్చ వెంకట్ పగలగొట్టుకున్నాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయనను స్టేషన్ కు తరలించారు.

హుచ్చ వెంకట్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే మైసూరు, కొడగు, సకలేశపుర తదితర ప్రదేశాల్లో కూడా వింతగా ప్రవర్తించాడు. స్థానికులతో గొడవపడి, దెబ్బలు కూడా తిన్నాడు.

Hucha Venkat
Kannada
College Girl
  • Loading...

More Telugu News