Prime Minister: ప్రధాని మోదీని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్

  • ఢిల్లీ పర్యటనలో కేసీఆర్
  • మోదీని శాలువాతో సత్కరించిన ముఖ్యమంత్రి 
  • ‘కాళేశ్వరం’కు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్న కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలిశారు. మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక కేసీఆర్ కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మోదీకి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయన్ని శాలువాతో కేసీఆర్ సత్కరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని, ‘మిషన్ భగీరథ’, ‘మిషన్ కాకతీయ’ పథకాలకు, గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్ట్ కు సాయం అందించాలని మోదీని ఆయన కోరుతున్నట్టు సమాచారం. అంతకుముందు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కేసీఆర్ కలిశారు.

Prime Minister
modi
Telangana
cm
kcr
  • Loading...

More Telugu News