WETA: ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న అమెరికాలోని తెలుగు మహిళలు

  • డబ్ల్యూఈటీఏ ఏర్పాటు
  • మహిళా సాధికారతే లక్ష్యం
  • ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుమలత

అమెరికాలో తానా, నాటా పేరుతో తెలుగు వాళ్ల కోసం సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తొలిసారిగా కేవలం తెలుగు మహిళలతో ప్రత్యేకంగా ఓ సంఘం ఏర్పడింది. దానిపేరు ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా-డబ్ల్యూఈటీఏ). ఈ సంఘాన్ని ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ఏర్పాటు చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ సంఘం రూపుదిద్దుకుంది.

ఇతర సంఘాలకు దీటుగా తెలుగు మహిళలకు సేవలు అందించడమే 'వేటా' ముఖ్యోద్దేశం. డబ్ల్యూఈటీఏ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ నటి, ఎంపీ సుమలత చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. మిల్పిటాస్ లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమలతకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ప్రదానం చేశారు.

  • Loading...

More Telugu News