West Godavari District: సీఎం ఏలూరు పర్యటన: ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన

  • రూ.266 కోట్ల వ్యయంతో నిర్మాణాలు
  • అనంతరం వాహన మిత్ర పథకానికి శ్రీకారం
  • ఎగ్జిబిషన్‌ మైదానం సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ నిర్మించనున్న వైద్య కళాశాలలో భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కళాశాలలో వసతి, తరగతి గదులు, ఇతరత్రా అవసరాల కోసం మొత్తం 266 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నారు.

 ఈ కార్యక్రమం అనంతరం స్థానిక ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగిన మరో కార్యక్రమంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న ‘వాహన మిత్ర’ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. అక్కడ లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఖాకీచొక్కాను జగన్ ధరించి వారికి ఆనందం మిగిల్చారు. ఈ సందర్భంగా అబ్ధిదారులు జగన్ కు దుశ్శాలువ కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు.

West Godavari District
Eluru
medical college
vahanamitra
  • Loading...

More Telugu News