KCT: ఢిల్లీలో కేసీఆర్.. షెడ్యూల్ లో స్వల్ప మార్పు

  • 11 గంటలకు మోదీని కలవాల్సిన కేసీఆర్
  • సాయంత్రం 4.30 గంటలకు పోస్ట్ పోన్ అయిన భేటీ
  • 1.30 గంటలకు అమిత్ షా తో భేటీకానున్న సీఎం  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ కావాల్సి ఉంది. కానీ, ఆయన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు మోదీతో ఆయన భేటీ అవుతారు.

ఇక దీనికంటే ముందు మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. ఈ భేటీల సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో కేసీఆర్ చర్చించనున్నారు. ఏదైనా ఒక నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.  

గత డిసెంబర్ 26న మోదీని చివరిసారిగా కేసీఆర్ కలిశారు. దాదాపు 9 నెలల తర్వాత నేడు మరోసారి కలవనున్నారు. మోదీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయనను కేసీఆర్ కలవడం ఇదే తొలిసారి.

KCT
TRS
Narendra Modi
Amit Shah
BJP
  • Loading...

More Telugu News