Jana Sena: జనసేనకు గుడ్‌ బై చెప్పే యోచనలో ఆకుల...త్వరలో వైసీపీలోకి

  • 2014లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపు
  • ఎన్నికల ముందు బీజేపీని వీడి జనసేనలోకి
  • రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓటమి

గత సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన ఆ పార్టీ సీనీయర్‌ నేత ఆకుల సత్యనారాయణ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. 2014లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలు పొందిన సత్యనారాయణ సార్వత్రిక ఎన్నికల ముందు ఆ పార్టీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం పార్టీ ఇచ్చింది. జనసేనాని ఆధ్వర్యంలో అదృష్టం పరీక్షించుకున్నా ఓటమి తప్పలేదు.

అప్పటి నుంచీ పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్టు వుంటున్న ఆయన, ఇప్పుడు అధికార వైసీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారని సమాచారం. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవలే జనసేనకు రావెల కిశోర్‌బాబు రాంరాం చెప్పేశారు. తాజాగా ఆకుల సత్యనారాయణ కూడా పార్టీ వీడనుండడం ఆ పార్టీకి గట్టి షాకే.

Jana Sena
YSRCP
akula satyanarayana
rajumandry
  • Loading...

More Telugu News