Nalgonda District: టీవీ ఛానెల్‌ మార్పు విషయంలో వివాదం... రోకలి బండతో మోది తండ్రి హత్య

  • మద్యం మత్తులో ఓ కొడుకు దారుణం
  • నల్గొండ జిల్లా కేంద్రంలో ఘటన
  • స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి పోలీసులు

టీవీ ఛానెల్‌ మార్చడం విషయంలో తండ్రితో గొడవపడి ఆవేశానికి లోనైన కొడుకు అతన్ని హత్య చేసిన ఘటన ఇది. మద్యం మత్తులో కొడుకు పాల్పడిన ఈ దారుణం స్థానికంగా సంచలనమైంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశ్‌ బజార్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.

మల్ల గోవర్ధన్ (60) తన కొడుకు సతీష్‌తో కలిసి ప్రకాశ్‌బజార్‌లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి  సతీష్‌ పూటుగా మద్యం తాగి, ఇంటికి వచ్చాడు. అప్పటికే తండ్రి గోవర్ధన్ టీవీ చూస్తున్నాడు. ఇంటికి వచ్చిన సతీష్‌ ఛానెల్‌ మార్చేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న సతీష్‌ ఈ సందర్భంగా ఆవేశానికి లోనై పక్కనే ఉన్న రోకలి బండతో తండ్రి తలపై కొట్టాడు. బలమైన గాయం కావడంతో గోవర్ధన్ అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Nalgonda District
man murdered
son accused
Crime News
  • Loading...

More Telugu News