nijamabad district: తిట్టి, కొట్టి నిత్యం నాన్న వేధిస్తున్నాడు: పోలీసులకు ఎనిమిదేళ్ల చిన్నారి ఫిర్యాదు

  • నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలో ఘటన
  • తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌
  • బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

అకారణంగా తండ్రి తనను తిట్టి, కొట్టి వేధిస్తున్నాడంటూ ఓ ఎనిమిదేళ్ల బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. నాన్న నిత్యం పెట్టే వేధింపులు భరించలేకపోతున్నానని, తనను కాపాడాలని వేడుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు..

గ్రామానికి చెందిన ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు వర్ని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తండ్రిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి జరిగిన దానిపై ఆరా తీశారు. అనంతరం తల్లిదండ్రులు ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇకపై ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో కొడుకును వారికి అప్పగించారు. పిల్లాడ్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు వారికి సూచించారు.

nijamabad district
varni mandal
son compliant on father
police counceling
  • Loading...

More Telugu News