Vikram: ఒకే సినిమాలో 25 గెటప్పులతో కనిపించనున్న విక్రమ్

  • సీనియర్ హీరోల్లో విక్రమ్ స్థానం ప్రత్యేకం 
  • అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కొత్త సినిమా 
  • రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ 

తమిళంలోని సీనియర్ స్టార్ హీరోలలో విక్రమ్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. ప్రయోగాత్మక పాత్రలకి ప్రాధాన్యతను ఇవ్వడం ఆయన ప్రత్యేకత. అందువలన ఆ తరహా కథలు ఆయన దగ్గరికి ఎక్కువగా వెళుతుంటాయి. తాజాగా ఆయన మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

ఇక ఈ సినిమాలో విక్రమ్ 25 గెటప్పులతో కనిపించనున్నాడని చెబుతున్నారు. తొలి షెడ్యూల్లోనే ఓ డిఫరెంట్ గెటప్పులో ఆయన షూటింగులో పాల్గొంటాడని అంటున్నారు. ప్రపంచ సినీచరిత్రలో కథను బట్టి ఒకే సినిమాలో 25 గెటప్పులు వేసిన హీరోలు లేరట. అరుదైన ఆ రికార్డును దక్కించుకోవడం కోసమే విక్రమ్ రంగంలోకి దిగాడని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News