Allu Arjun: కొత్త ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన అల్లు అర్జున్

  • కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న అల్లు అర్జున్
  • భార్యాపిల్లలతో కలసి భూమిపూజ
  • కొత్త ఇంటికి 'బ్లెస్సింగ్' అని నామకరణం

హీరో అల్లు అర్జున్ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. నూతన నివాసానికి ఈరోజు శాస్త్రోక్తంగా భూమిపూజ చేశారు. తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు, కుమార్తెతో కలసి ఈరోజు ఈ కార్యక్రమమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటుకలను పేర్చి, సిమెంట్ వేస్తున్న ఫొటోను అల్లు అర్జున్ ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్ తో కలిసే ఉంటున్నారు. తమ కొత్త ఇంటికి 'బ్లెస్సింగ్' అనే పేరు పెట్టారు. మరోవైపు, కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న అల్లు అర్జున్ కు అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Allu Arjun
New House
Foundation
Tollywood
  • Loading...

More Telugu News