Sye Raa Narasimha Reddy: ‘సైరా’ సినిమాను మొబైల్‌లో చిత్రీకరిస్తున్న వ్యక్తిపై ‘చిరు’ అభిమానుల దాడి

  • ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఘటన
  • పైరసీ చేస్తున్నాడని భావించి ఆటో డ్రైవర్‌పై దాడి
  • పైరసీ కాదని నిర్ధారించి హెచ్చరించి పంపిన పోలీసులు

చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూస్తున్న ఆటో డ్రైవర్ ప్రసాద్ ఓ సన్నివేశాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా గమనించిన చిరంజీవి అభిమానులు అతడిని పట్టుకుని దాడి చేశారు. సినిమాను పైరసీ చేస్తున్నాడని భావించి ఐమాక్స్ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులకు అతడిని అప్పగించారు. ప్రసాద్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. సినిమా మొత్తం కాకుండా ఒక్క సన్నివేశాన్ని మాత్రమే అతడు చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు. అతడు పైరసీ చేసేందుకు చిత్రీకరించలేదని నిర్ధారించిన పోలీసులు అతడిని హెచ్చరించి పంపించివేశారు.

Sye Raa Narasimha Reddy
auto driver
prasad multplex
movie
video
  • Loading...

More Telugu News