Sudha Narayanamurthy: టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసిన సుధా నారాయణమూర్తి

  • ప్రమాణస్వీకారానికి వైవీ సుబ్బారెడ్డి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హాజరు
  • ఇటీవలే 24 మంది పేర్లు ఖరారు
  • పూర్తిస్థాయిలో కొలువుదీరిన టీటీడీ బోర్డు

ఇటీవలే టీటీడీ పాలకమండలి సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అర్ధాంగి సుధా నారాయణమూర్తికి కూడా స్థానం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ టీటీడీ బోర్డు సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూడా హాజరయ్యారు. చైర్మన్ తో పాటు 24 మంది సాధారణ సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో టీటీడీ జంబో పాలకవర్గం పూర్తిస్థాయిలో కొలువుదీరింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా టీటీడీ బోర్డులోకి తీసుకున్నారు.

Sudha Narayanamurthy
TTD
Tirumala
Infosys
  • Loading...

More Telugu News