Huzurnagar: హుజూర్ నగర్ లో సీపీఎంను మద్దతు కోరిన టీడీపీ

  • తిరస్కరణకు గురైన సీపీఎం అభ్యర్థి నామినేషన్
  • సీపీఎం నేతలకు ఫోన్ చేసిన ఎల్.రమణ  
  • ఆలోచించి చెబుతామన్న సీపీఎం నేతలు

తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ ఉపఎన్నిక కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. టీఆర్ఎస్ కే తమ మద్దతు అని సీపీఐ ప్రకటించగా, కాంగ్రెస్ అభ్యర్థినే బలపరుస్తామంటూ కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ స్పష్టం చేస్తోంది. అయితే, హుజూర్ నగర్ లో తమకు మద్దతు ఇవ్వాలంటూ టీడీపీ తాజాగా సీపీఎంను కోరుతోంది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ ద్వారా సీపీఎం నేతలను సంప్రదించారు. సీపీఎం నామినేషన్ తిరస్కరణకు గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయిని బలపర్చాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆలోచించి చెబుతామని సీపీఎం నేతలు బదులిచ్చారు.

Huzurnagar
Telangana
Telugudesam
CPM
TRS
Congress
L.Ramana
  • Loading...

More Telugu News