CPI Narayana: సీపీఐ నారాయణ ఒక చీడ పురుగు: బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

  • కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంతాలను అమ్ముకున్నాయి
  • ఎమ్మెల్సీ పదవి కోసం ఆశ పడుతున్నారు
  • సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాస్తా

సీపీఐ నేత నారాయణపై తెలంగాణ బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. నారాయణ ఒక చీడ పురుగని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీపీఐ, సీపీఎం పార్టీలు తమ సిద్ధాంతాలను అమ్ముకున్నాయని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్ల ముందు సీపీఐ, నామినేషన్ల తర్వాత సీపీఎం టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నాయని అన్నారు.

కమ్యూనిస్టుల గురించి గతంతో కేసీఆర్ ఎలా మాట్లాడారో ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోవడం వల్లే వామపక్షాలతో ఆ పార్టీ కాళ్ల బేరానికి వచ్చిందని అన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం కమ్యూనిస్టులు ఆశ పడుతున్నారని... ఈ ఎన్నికలు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా మారాయని విమర్శించారు. సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు రాజా, సీతారాం ఏచూరిలకు లేఖలు రాస్తానని చెప్పారు.

CPI Narayana
NVSS Prabhakar
BJP
KCR
TRS
CPM
  • Loading...

More Telugu News