Baburam Nishad: నా భర్త నాపై మూత్రం పోసి, హింసిస్తున్నాడంటూ మోదీకి ఫిర్యాదు చేసిన బీజేపీ మంత్రి భార్య

  • 14 ఏళ్ల క్రితం బాబూరామ్ తో నాకు పెళ్లయింది
  • ప్రతి రోజూ నా భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నారు
  • గన్ తో కాల్చేస్తానని బెదిరిస్తున్నారు

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాబూరామ్ నిషాద్ పై ఆయన భార్య నీతు నిషాద్ ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ లకు ఫిర్యాదు చేశారు. తనపై తన భర్త మూత్రం పోస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఆమె పోస్ట్ చేశారు. 14 ఏళ్ల క్రితం బాబూరామ్ తో తనకు పెళ్లయిందని ఆమె తెలిపారు.

ప్రతి రోజూ తన భర్త తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని నీతు ఆరోపించారు. గన్ తో కాల్చేస్తానని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని అన్నారు. తన భర్తపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా మోదీ, యోగిలను ఆమె వేడుకున్నారు.

నీతు చేసిన ఆరోపణలపై బాబూరామ్ స్పందించారు. ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. ప్రతి రోజూ తన నుంచి ఆమె డబ్బు డిమాండ్ చేస్తోందని తెలిపారు. అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్న కారణంగా ఆమె నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించానని చెప్పారు.

Baburam Nishad
Wife
Narendra Modi
Yogi Adityanath
  • Loading...

More Telugu News