Sye Raa Narasimha Reddy: సైరా ఎఫెక్ట్... విజయోత్సాహంతో ఫొటోలకు పోజులిచ్చిన చిరంజీవి

  • నేడు సైరా రిలీజ్
  • ప్రేక్షకుల నుంచి విశేష స్పందన
  • సంబరాల్లో చిత్ర యూనిట్

సినిమా రంగంలో పునఃప్రవేశం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ముఖంలో విజయోత్సాహం తొణికిసలాడుతోంది. తన 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి కూడా విశేష స్పందన లభిస్తుండడంతో ఆయన హ్యాపీ మూడ్ లో వున్నారు. ఎంతో మనసుపడిన కథ, మనసుపెట్టి తీసిన దర్శకుడు, ఖర్చుకు వెనుకాడని నిర్మాత, నూటికి నూరుశాతం ప్రదర్శన ఇచ్చిన నటీనటులు, అద్భుత నైపుణ్యం కనబర్చిన సాంకేతిక నిపుణులు సైరా చిత్రాన్ని బ్లాక్ బస్టర్ గా మలిచారన్నది ఇప్పటివరకు వచ్చిన రివ్యూల సారాంశం. ఈ నేపథ్యంలో, చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి తదితర యూనిట్ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అందరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చి తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sye Raa Narasimha Reddy
Chiranjeevi
Ramcharan
Tollywood
  • Loading...

More Telugu News