Sye Raa Narasimha Reddy: 'సైరా నరసింహారెడ్డి' చిత్రంపై రాజమౌళి వ్యాఖ్యలు

  • బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సైరా
  • నరసింహారెడ్డి పాత్రకు చిరు ప్రాణం పోశారంటూ ట్వీట్
  • తెరమరుగైన వీరుడి కథకు జీవం కల్పించారని ప్రశంసలు

తెలుగు గడ్డపై బ్రిటీష్ వారి పాలనను ఎదిరించిన పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ చారిత్రక చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎక్కడ చూసినా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సైరా మూవీపై టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. సైరా నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి గారు ప్రాణప్రతిష్ట చేశారని కితాబిచ్చారు. చరిత్ర మర్చిపోయిన వీరుడి కథకు మళ్లీ జీవం పోశారని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

జగపతిబాబు గారు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ప్రతి ఒక్కరూ కథలో ఇమిడిపోయే పాత్రలతో సినిమాకు వన్నె తెచ్చారని రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నానని, సైరా నరసింహారెడ్డి ఘనవిజయానికి వారిద్దరూ అర్హులేనని పేర్కొన్నారు.

Sye Raa Narasimha Reddy
Rajamouli
Ramcharan
Tollywood
  • Loading...

More Telugu News