Telangana: తెలంగాణ ప్రభుత్వ యత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసిన హైకోర్టు

  • కేసులు తేలేంత వరకు సచివాలయ భవనాలను కూల్చవద్దు
  • మా ఆదేశాలను కాదని కూల్చివేస్తే... న్యాయ ప్రక్రియకు అడ్డు తగిలినట్టే
  • మా సందేశాన్ని ప్రభుత్వానికి తెలపాల్సిన బాధ్యత అడ్వొకేట్ జనరల్ దే

పాత సచివాలయాన్ని కూల్చి, ఆ ప్రాంతంలో కొత్త సచివాలయాన్ని వెంటనే నిర్మించాలనుకున్న తెలంగాణ ప్రభుత్వ యత్నాలకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. విచారణలో ఉన్న కేసులు తేలేంత వరకు ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చవద్దని ఆదేశించింది. తమ ఆదేశాలను కాదని కూల్చివేత పనులను చేపడితే... న్యాయ ప్రక్రియకు అడ్డు తగిలినట్టేనని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హైకోర్టు సందేశాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత అడ్వొకేట్ జనరల్ దేనని తెలిపింది.

సచివాలయంలోని వివిధ విభాగాలను ఇతర భవనాలకు తరలించే యత్నాలను తాము అడ్డుకోవడం లేదని... కేవలం కూల్చివేతలపైనే ఆదేశాలను జారీ చేస్తున్నామని చెప్పింది. దసరా సెలవుల తర్వాత పిటిషన్లపై వీలైనంత త్వరగా తేల్చివేస్తామని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 14న చేపడతామని చెప్పింది.

Telangana
Secretariat
High Court
  • Loading...

More Telugu News