Rajini: సొంత పార్టీ వ్యక్తులే వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారు.. వారి అంతు చూస్తా: వైసీపీ ఎమ్మెల్యే రజని

  • ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు నెలలు గడుస్తున్నా ఏ రోజూ ఆనందం లేదు
  • నాలుగు వైపులా శత్రువులతో పోరాడాల్సి వస్తోంది
  • సొంత పార్టీ వ్యక్తులతోనే యుద్ధం చేయాల్సి వస్తోంది

ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు నెలలు గడుస్తున్నా ఏ రోజూ ఆనందాన్ని మనసారా ఆస్వాదించలేదని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే రజని అన్నారు. సొంత పార్టీలోని వ్యక్తులే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆడపిల్లనైన తాను నాలుగు వైపులా శత్రువులతో పోరాడాల్సి వస్తోందని అన్నారు. తన వెంటే ఉంటూ వెన్నుపోటు పొడవాలనుకుంటున్నవారి అంతు చూస్తానని హెచ్చరించారు. ఇదే తన నైజమని స్పష్టం  చేశారు. చిలకలూరిపేటలో వైసీపీ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చిలకలూరిపేటలో అవినీతి గద్దలను తరిమేయాలనే లక్ష్యంతో జగనన్న స్థాపించిన వైసీపీలో చేరానని... కానీ, తన కలలను చిదిమేయడానికి కొన్న దుష్ట శక్తులు యత్నిస్తున్నాయని రజని మండిపడ్డారు. మనలో నిజాయతీ ఉంటే గెలుపు తథ్యమనే నిజాన్ని మొన్నటి ఎన్నికలు నిరూపించాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీతో, మాజీ మంత్రితో ఎంతవరకైనా పోరాడవచ్చని... కానీ, సొంత పార్టీ వ్యక్తులతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోందని ఆమె వాపోయారు. 

Rajini
YSRCP MLA
Chilakaluripeta
  • Loading...

More Telugu News