ETV: మహాత్మాగాంధీకి వైవిధ్యంగా నివాళి అర్పించిన ఈటీవీ

  • 15వ శతాబ్దంలో గుజరాతీ కవి రచించిన భజన గీతం ‘వైష్ణవ జనతో’ 
  • దేశంలోని ప్రముఖ గాయకులతో వీడియో రూపం ఇచ్చిన ఈటీవీ
  • ఆవిష్కరించిన రామోజీరావు

మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ తెలుగు చానల్ ఈటీవీ బాపూజీకి వైవిధ్యంగా నివాళి అర్పించింది. బోసినవ్వుల గాంధీకి అత్యంత ఇష్టమైన ‘వైష్ణవ జనతో’ భజన గీతానికి వీడియో రూపం ఇచ్చింది. 15వ శతాబ్దానికి చెందిన గుజరాతీ కవి నర్సింగ్ మెహతా ఈ భజనను రచించారు. ఇప్పుడీ గీతాన్ని దేశంలోని ప్రముఖ గాయకులైన కేఎస్ చిత్ర, ఆర్.విజయ్ ప్రకాశ్, యోగేశ్ గధ్వి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుభాష్ చంద్ర దాస్, పులక్ బెనర్జీ, శంకర్ షానే, సలామత్ ఖాన్, పండిట్ చన్నూలాల్ మిశ్రా, ఉన్ని కృష్ణన్, హైమంతి శుక్లా, వైశాలి మడే తదితరులు ఈ భజనను ఆలపించారు. రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు హైదరాబాద్‌లో ఈ గీతాన్ని ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News