Hyderabad: సత్తా చాటిన అంబటి రాయుడు.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు అలవోక విజయం

  • వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రాయుడు
  • ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
  • ఆపై హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక

వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. ఆపై ఉపసంహరించుకున్న అంబటి రాయుడు సత్తా చాటాడు. హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన రాయుడు..  విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును అలవోకగా విజయ తీరాలకు చేర్చాడు. 111 బంతులు ఎదుర్కొన్న రాయుడు 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 87 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ బౌలర్ సందీప్ 35 పరుగులిచ్చి 4 వికెట్లు నేలకూల్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కర్ణాటక 45.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌట్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్ దేవదత్త (60), కెప్టెన్ మనీశ్ పాండే (48) తప్ప ఆ జట్టులో ఎవరూ పెద్దగా రాణించలేదు.

Hyderabad
Crime News
ambati rayudu
  • Loading...

More Telugu News