Syeraa: సైరా విడుదలకు ముందు భావోద్వేగాలకు లోనైన రామ్ చరణ్

  • రేపు సైరా విడుదల
  • సోషల్ మీడియాలో రామ్ చరణ్ స్పందన
  • సైరా పూర్తయితే బాధగా ఉందంటూ వ్యాఖ్యలు

తన తండ్రి చిరంజీవి జీవితకాల కల సైరా నరసింహారెడ్డి చరిత్రను సినిమాగా తెరకెక్కించిన రామ్ చరణ్ ఇప్పుడు భావోద్వేగాలకు లోనవుతున్నాడు. రేపు అక్టోబరు 2న సైరా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ సోషల్ మీడియాలో స్పందించారు.

 ఎంతోమంది దిగ్గజాలు, నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం కల్పించిన సైరా, తామందరినీ ఓ కుటుంబంగా మార్చేసిందని, ఇప్పుడా సినిమా పూర్తయిందంటే ఎంతో బాధగా ఉందని పేర్కొన్నాడు. అయితే, తాము ఎంతో శ్రమించి తెరకెక్కించిన ఆ చిత్రం ఇప్పుడు ప్రేక్షకులు చూడబోతుండడం పట్ల సంతోషంగా ఉందని, ప్రతి సినిమా రిలీజ్ కు ముందు ఉండే ఆందోళన, ఉద్విగ్నత ఇప్పుడు కూడా కలుగుతున్నాయని తెలిపాడు.

"నా తండ్రి అతి పెద్ద కలను నిజం చేయడం నాకు జీవితకాల జ్ఞాపకం. సైరా రిలీజ్ నేపథ్యంలో నా మనసు నిండా భావోద్వేగాలే. మేమంతా ఎంతో కష్టపడి రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందో మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది" అంటూ ప్రేక్షకులకు, అభిమానులకు సందేశం వెలువరించారు.

Syeraa
Sye Raa Narasimha Reddy
Ramcharan
Chiranjeevi
  • Loading...

More Telugu News