Chandrababu: మంచిని మంచి అని చెప్పే సంస్కారం చంద్రబాబుకు లేదు: ఉమ్మారెడ్డి విమర్శలు

  • చంద్రబాబుపై ఉమ్మారెడ్డి వ్యాఖ్యలు
  • జన్మభూమి కమిటీలతో దోచుకుతిన్నారంటూ ఆరోపణ
  • సీఎం జగన్ పై ప్రశంసలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో తాము ముందుకెళుతుంటే, కొందరు గ్రామ సచివాలయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంచిని మంచి అని చెప్పే సంస్కారం చంద్రబాబుకు లేదని అన్నారు. చంద్రబాబు గ్రామ పంచాయతీలను పక్కన పెట్టేసి, జన్మభూమి కమిటీలను తీసుకొచ్చి దోచుకుతిన్నారని ఆరోపించారు. తమ నాయకుడు వైఎస్ జగన్ 4 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించాడని, జగన్ పాలనతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు.

Chandrababu
Ummareddy
Telugudesam
YSRCP
Jagan
  • Loading...

More Telugu News