Mohan Babu: 'సైరా' విడుదల నేపథ్యంలో మోహన్ బాబు వ్యాఖ్యలు

  • బెస్టాఫ్ లక్ చెప్పిన మోహన్ బాబు
  • చిరంజీవి మంచి నటుడని కితాబు
  • 'సైరా' అత్యద్భుత విజయం సాధించాలని ఆకాంక్ష

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్ర పోషించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించింది.

ఈ నేపథ్యంలో, సీనియర్ నటుడు మోహన్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. తన మిత్రుడు చిరంజీవి మంచి నటుడని కితాబిచ్చారు. 'చిరంజీవి కుమారుడు చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించిన 'సైరా' అత్యద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు. నిర్మాతగా వ్యవహరించిన చరణ్ కు, చిరంజీవికి డబ్బుతో పాటు పేరుప్రఖ్యాతులు కూడా రావాలని మనసా వాచా కోరుకుంటున్నానని బెస్టాఫ్ లక్ చెప్పారు.

Mohan Babu
Chiranjeevi
Ramcharan
Sye Raa Narasimha Reddy
Tollywood
  • Loading...

More Telugu News