India: రేపటి నుంచి విశాఖలో తొలి టెస్ట్ మ్యాచ్.. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠ!

  • భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపటి నుంచి తొలి టెస్ట్
  • మ్యాచ్ ను వర్షం ఆటంకపరిచే అవకాశం
  • నిన్న కూడా విశాఖలో భారీ వర్షం

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రేపటి నుంచి విశాఖపట్నంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, మ్యాచ్ ను వర్షం అడ్డుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు వర్షం కురవడానికి 80 శాతం అవకాశాలు ఉన్నాయి. ఇంకోవైపు, విజయనగరంలో జరిగిన వార్మప్ మ్యాచ్ తొలి రోజు కూడా వర్షం వల్ల ఆగిపోయింది. నిన్న కూడా విశాఖలో భారీ వర్షం కురిసింది. అయితే నిర్వాహకులు యుద్ధ ప్రాతిపదికన నెట్ ప్రాక్టీస్ కు గ్రౌండ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో, ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు.

India
South Africa
First Test Match
Vizag
Team India
  • Loading...

More Telugu News