Vijayawada: తన తప్పు లేకున్నా మందలించారని.. దుర్గగుడి టోల్ గేట్ వద్ద పోలీసు అధికారి అర్ధనగ్న ప్రదర్శన

  • ఉత్సవ కమిటీ కార్లలో మంత్రి అనుచరులు
  • అడ్డుకున్న పోలీసు అధికారికి అంక్షింతలు
  • మనస్తాపంతో చొక్కా విప్పి అర్ధనగ్న ప్రదర్శన

తన తప్పు లేకపోయినా మందలించారన్న మనస్తాపంతో ఓ పోలీసు అధికారి అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు. గత రాత్రి 10:30-11 గంటల మధ్య విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు టోల్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసు అర్ధనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ మంత్రి అనుచరులు కొందరు ఉత్సవ కమిటీ కార్లలో వస్తుండగా సదరు పోలీసు అధికారి అడ్డుకున్నారు. దీంతో వారు మంత్రికి ఫోన్ చేయడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు మంత్రి అనుచరులు వెళ్తున్న కార్లను ఆపిన పోలీసు అధికారికి ఫోన్ చేసి మందలించారు.

అయితే, తాను ఎటువంటి తప్పూ చేయలేదని చెబుతున్నా వినిపించుకోకుండా, ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయిస్తామంటూ పై అధికారులు మండిపడ్డారని సదరు పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, తీవ్ర మనస్తాపంతో చొక్కా విప్పి నిరసన తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ అది నిరసన కాదని, అతడు ఫిట్స్ వచ్చి పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పడం గమనార్హం.

Vijayawada
Police
Andhra Pradesh
durga temple
  • Loading...

More Telugu News