Telangana: తెలంగాణ సర్కారుకు ఊరట... విద్యార్థుల ఆత్మహత్యలపై జోక్యం చేసుకోలేమన్న సుప్రీం

  • తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళం
  • పదుల సంఖ్యలో విద్యార్థుల బలవన్మరణం
  • జోక్యం చేసుకోవాలని కోరిన బాలల హక్కుల సంఘం

ఈ ఏడాది వేసవిలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఎంతటి విషాదానికి కారణమయ్యాయో అందరికీ తెలిసిందే. ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితులు అనేకమంది విద్యార్థుల బలవన్మరణానికి దారితీశాయి. దీనిపై బాలల హక్కుల సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భవిష్యత్ లో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలివ్వాలంటూ తన పిటిషన్ లో అర్థించింది.

అయితే, దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో హైకోర్టు ఈ వ్యవహారంలో ఇచ్చిన ఆదేశాలపై తాము సమీక్షించలేమని, ఈ విషయంలో ఇప్పటికే కొండలరావు పిటిషన్ ను కూడా కొట్టివేశామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యంగా, విద్యార్థుల ఆత్మహత్యలకు ఫలితాలే కారణం అన్న వాదనతో తాము ఏకీభవించలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

  • Loading...

More Telugu News