Romantic Movie: కుమారుడితో పూరీ జగన్నాథ్ 'రొమాంటిక్' మూవీ.. ఫస్ట్ లుక్ విడుదల

  • అనిల్ పాడూరి దర్శకత్వంలో 'రొమాంటిక్' మూవీ
  • నిర్మాతలుగా పూరీ జగన్నాథ్, ఛార్మీ
  • యూత్ ను ఆకట్టుకునే విధంగా ఫస్ట్ లుక్

'ఇస్మార్ శంకర్'తో చాలా కాలం తర్వాత సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు పూరీ జగన్నాథ్... వేగం పెంచారు. తన కుమారుడు ఆకాశ్ తో 'రొమాంటిక్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశ్ కు జోడీగా కేతికా శర్మ ఈ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా రొమాంటిక్ గా ఉంది. యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉండబోతోందనే విషయం ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. 'రొమాన్స్ అనేది ఎప్పటికీ చాలా ఘాటుగా ఉంటుంది' అంటూ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ పాడూరి తెరకెక్కిస్తుండగా... పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Romantic Movie
First Look
Tollywood
Puri Jagannadh
Charmi
Akash Puri
Anil Paduri
  • Loading...

More Telugu News