INS Vikramadithya: విమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ప్రయాణించిన రాజ్ నాథ్ సింగ్

  • యుద్ధనౌకలో 24 గంటల పాటు గడిపిన రాజ్ నాథ్
  • సముద్ర విహారం చేసిన రక్షణ మంత్రి
  • విక్రమాదిత్య ఎంతో కీలకమైనదని వ్యాఖ్యలు

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవలే తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో వాయువిహారం చేశారు. తాజాగా నావికాదళానికి చెందిన ప్రధాన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ప్రయాణించారు. యుద్ధనౌకలో ప్రవేశించిన ఆయన దాదాపు 24 గంటలపాటు సముద్రంలోనే గడిపారు. ముంబయిలో అత్యాధునిక జలాంతర్గామి ఖండేరీని నేవీకి అప్పగించిన ఆయన ఆపై విక్రమాదిత్యలో సముద్ర విహారం చేశారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ, విమాన వాహక యుద్ధనౌకల్లో ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎంతో కీలకమైనదని అన్నారు.

INS Vikramadithya
Rajnath Singh
  • Loading...

More Telugu News