TSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ఘంటికలు.. దసరా సీజన్ లో పరేషాన్ తప్పదా?

  • అక్టోబరు 5 నుంచి సమ్మె
  • సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాల జేఏసీ
  • తమ డిమాండ్లు పరిష్కరించాలంటున్న కార్మిక సంఘాల నేతలు

పండుగ సీజన్లలో ఆర్టీసీకి కాసుల వర్షం కురుస్తుందన్న సంగతి తెలిసిందే.  సాధారణ రోజుల కంటే అత్యధికంగా ఆదాయం ఆర్జించే అవకాశం పండుగలప్పుడే వస్తుంది. ఉన్న బస్సులకు తోడు స్పెషల్ బస్సులు కూడా తిప్పుతూ ప్రజలను సొంతూళ్లకు తరలించడంలో ఆర్టీసీదే అగ్రస్థానం. అయితే, తెలంగాణ ఆర్టీసీ ఈ దసరా సీజన్ లో సమ్మె సైరన్ మోగించాలని నిర్ణయించింది. అక్టోబరు 5వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సమ్మె చేస్తున్నట్టు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ వెల్లడించింది.

కూలంకషంగా చర్చించిన తర్వాత సమ్మె నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఏడాదిన్నర సమయం ఇచ్చినా ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకునే చిత్తశుద్ధి ప్రభుత్వంలో లోపించిందని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి అన్నారు. సమ్మె వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. సమ్మెకు వారం రోజుల సమయం ఉన్నందున ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి చర్చలకు రావాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కొత్త రిక్రూట్ మెంట్లు, ఉద్యోగ భద్రత వంటి పలు డిమాండ్లతో టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు దిగుతోంది.

  • Loading...

More Telugu News