Chiranjeevi: శంకర్ బాబూ, నిన్ను చూస్తుంటే ఎవరో మహానుభావుడ్ని చూసినట్టుంది అని మా అమ్మ చెప్పింది: చిరంజీవి

  • విడుదలకు ముస్తాబవుతోన్న సైరా
  • ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న చిరు
  • అభిమానుల మధ్య సినిమా చూడాలని కోరుకుంటున్న చిరు తల్లి

సైరా విడుదల సమయం దగ్గరపడింది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటించిన చిత్రం సైరా. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. సైరా గెటప్ లో ఉన్న తనను చూసి తన తల్లి అంజనాదేవి ఎంతో సంతోషపడిందని తెలిపారు. శంకర్ బాబూ, నిన్ను చూస్తుంటే ఎవరో మహానుభావుడ్ని చూసినట్టుందిరా అంటూ ముగ్ధురాలైందని చిరు వివరించారు.  

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మామూలు థియేటర్ లో సాధారణ ప్రేక్షకుల మధ్యన కూర్చుని సైరా సినిమా చూస్తానని చెప్పిందని వెల్లడించారు. తామందరం మల్టీప్లెక్స్ లో సైరా చూద్దామన్నా తన తల్లి ససేమిరా అంటోందని, అభిమానుల కోలాహలం మధ్యనే సినిమా చూడాలని కోరుకుంటోందని తెలిపారు. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అని తెలిసిందే.

Chiranjeevi
Syeraa
Sye Raa Narasimha Reddy
Tollywood
Anjana Devi
  • Loading...

More Telugu News