TSRTC: సమ్మెకు దిగనున్న టీఎస్ ఆర్టీసీ కార్మికులు!

  • టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
  • కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ సమావేశం
  • సమావేశం అనంతరం సమ్మె తేదీల ప్రకటన

టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో చర్చించిన అనంతరం సమ్మె తేదీలను ప్రకటించనుంది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్  చేస్తున్నారు.

కాగా, ఈ విషయమై అక్టోబర్ 4న చర్చలు నిర్వహించేందుకు ఆర్టీసీని కార్మిక శాఖ ఇటీవలే ఆహ్వానించింది. ఈలోపే సమ్మె తేదీలను ప్రకటించేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధపడటం గమనార్హం.

  • Loading...

More Telugu News