Srinivasa Reddy: హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి సినిమా నుంచి ఫస్టులుక్

  • హాస్య నటుడిగా శ్రీనివాస్ రెడ్డికి మంచి గుర్తింపు 
  • దర్శక నిర్మాతగా తొలి ప్రయత్నం 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు    

కమెడియన్ గా శ్రీనివాసరెడ్డి సుదీర్ఘ కాలంగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు. 'గీతాంజలి' .. 'జయమ్ము నిశ్చయమ్మురా' వంటి చిత్రాలు ఇంచుమించు ఆయనను హాస్య కథానాయకుడి స్థానంలో నిలబెట్టేశాయి. అలాంటి శ్రీనివాసరెడ్డి దర్శక నిర్మాతగాను తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి దిగిపోయాడు. తను ప్రధానమైన పాత్రను పోషిస్తూ, దర్శక నిర్మాతగా ఆయన చేసిన చిత్రమే 'భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు'.

పూర్తి హాస్యరసభరితంగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్టులుక్ ను విడుదల చేశాడు. శ్రీనివాసరెడ్డితో పాటు ఈ సినిమాలో షకలక శంకర్ .. సత్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 'మంచి రసగుల్లా లాంటి సినిమా' అంటూ వదిలిన ఈ పోస్టర్లో ఈ ముగ్గురూ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srinivasa Reddy
Shakalaka Shankar
sathya
  • Loading...

More Telugu News