delivary in flight: విమానంలో ప్రసవించిన మహిళ...అత్యవసరంగా ల్యాండింగ్

  • శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఘటన
  • తల్లీబిడ్డలు జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తరలింపు
  • దుబాయ్‌ నుంచి మనీలా వెళ్తున్న విమానం

దుబాయ్‌ నుంచి ఫిలిప్పిన్స్‌ రాజధాని మనీలాకు వెళ్తున్న విమానంలో ఓ మహిళ ప్రసవించడంతో విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. అనంతరం తల్లీబిడ్డలను జూబ్లీహిల్స్‌లో ఉన్న అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. దుబాయ్‌లో విమానం బయలుదేరిన కాసేపటికి మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.

దీంతో విమానం సిబ్బంది అత్యవసర ల్యాండింగ్‌కు సమీపంలోని శంషాబాద్‌ విమానాశ్రయం ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించారు. వారు ల్యాండింగ్‌కు అనుమతించడంతో అత్యవసరంగా విమానాన్ని దించేశారు. అప్పటికే అంబులెన్స్‌తోపాటు వైద్యసిబ్బందిని సిద్ధంగా ఉంచడంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

delivary in flight
emergency landing
Hyderabad
smashabad
dubai
manila
  • Loading...

More Telugu News