bhagat singh: భగత్‌సింగ్‌కు ‘భారతరత్న’ ప్రకటించండి: మోదీకి లేఖ రాసిన పాక్‌లోని భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్

  • రేపు భగత్‌సింగ్ 112వ జయంతి
  • భారత హైకమిషనర్‌కు లేఖ అందించిన రషీద్ ఖురేషీ
  • జాన్ శాండర్స్ హత్య కేసులో భగత్‌సింగ్ నిర్దోషి అని నిరూపించేందుకు ఖురేషీ న్యాయ పోరాటం

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ 112వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించాలంటూ పాకిస్థాన్‌కు చెందిన ఓ సంస్థ భారత ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసింది. ఈ మేరకు పాకిస్థాన్‌లోని భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ.. పాక్‌లో భారత హైకమిషనర్ గౌరవ్ అహ్లూవాలియాకు ఈ లేఖను అందించారు. రేపు భగత్‌సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు మరణానంతర భారతరత్న అవార్డును ప్రకటించాలని అందులో కోరారు.

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్‌కు మోదీ ప్రభుత్వం అత్యంత గౌరవం ఇస్తోందన్న విషయం తమకు తెలుసన్న రషీద్.. ఆయన జయంతి సందర్భంగా అత్యున్నత పౌరపురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించాలని కోరుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ శాండర్స్ హత్య వెనక భగత్‌సింగ్ పాత్ర లేదని నిరూపించేందుకు న్యాయపోరాటం చేస్తున్న రషీద్.. ఆ కేసును మళ్లీ తెరవాలంటూ లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News